🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

29న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా..
బుధవారం నాడు చండీహోమం
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 29న భీమవరం మావుళ్లమ్మ దేవస్థానంలో అమ్మవారిని శాకంభరి స్వరూపిణిగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రత్యేక పూజలు, ఉదయం 7 గంటలకు చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు మరియు కార్యనిర్వాహణాధికారి విజ్ఞప్తి చేశారు.

Mavullamma Temple to Adorn Presiding Deity as Goddess Shakambari on Ashada Purnima
The revered Sri Mavullamma Devasthanam in Bhimavaram will celebrate Ashada Purnima on July 29 with the grand Shakambari Alankaram, during which the presiding deity will be adorned with an exquisite arrangement of leafy vegetables, fresh vegetables, fruits, and food grains, temple authorities announced.
As part of the religious celebrations, a Chandi Homam will be performed at 7:00 a.m. on Wednesday, invoking divine blessings for timely rainfall, abundant agricultural yield, prosperity for farmers, and the health, peace, and well-being of all people.
The temple is expected to witness a large influx of devotees, who will have the opportunity to offer prayers and seek the blessings of Goddess Shakambari, revered as the provider of nourishment and abundance.
Temple Assistant Commissioner Budda Mahalakshmi Nagesh, Chairman Bondada Nagabhushanam, members of the Temple Trust Board, and the Executive Officer have appealed to devotees to visit the temple with their families, participate in the special rituals, receive the divine darshan, and accept the sacred Theertha Prasadam.

