The Desk …Koyyalagudem : 15 రోజుల్లో రైతుల రహదారి సమస్యకు పరిష్కారం

The Desk …Koyyalagudem : 15 రోజుల్లో రైతుల రహదారి సమస్యకు పరిష్కారం

🟡 ఏలూరు జిల్లా : కొయ్యలగూడెం మండలం : పొంగుటూరు : ది డెస్క్

పొంగుటూరు రైతుల ప్రశంసలు అందుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్

400 ఎకరాల సాగుభూములకు చేరువ కల్పిస్తూ రహదారి, తూరల ఏర్పాటు

కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో తెరపడింది. గ్రామం మీదుగా నిర్మించిన జాతీయ రహదారి కారణంగా సుమారు 400 ఎకరాల సాగుభూములకు రైతులు చేరుకునే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా దాదాపు 200 ఎకరాల్లో వర్షపు నీరు వెళ్లే దారి లేక పంటలు ముంపునకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

ఈ సమస్యను కొడవటి రామకృష్ణ నేతృత్వంలో రైతులు ఇటీవల ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో సమన్వయం చేసి రహదారి, తూరల ఏర్పాటుకు చర్యలు చేపట్టించారు. కేవలం 15 రోజుల్లోనే పనులు పూర్తి చేయించి రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేలా మార్గం కల్పించారు.

సమస్యను వేగంగా పరిష్కరించి రైతులకు ఊరట కల్పించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు పొంగుటూరు గ్రామ రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.