The Desk… Vunguturu : గ్రామాభివృద్ధిపై ఉంగుటూరు మండలంలో సమీక్ష

The Desk… Vunguturu : గ్రామాభివృద్ధిపై ఉంగుటూరు మండలంలో సమీక్ష

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

తాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు సహా 15 అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో దిశానిర్దేశం

ఉంగుటూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నివారణ, IVRS కాల్స్, SWPC షెడ్ల నిర్వహణ, స్వచ్ఛరథం, స్వచ్ఛ పథకం, పన్నులు–పన్నేతర బకాయిల వసూళ్లు, వ్యయ నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్, చెరువుల వేలంపాటలు, మార్కెట్ వేలంపాటలు, పెన్షన్లు, పంచాయతీ సిబ్బంది పోస్టు శాంక్షన్ ఆర్డర్లు, SIR కంప్యూటరీకరణ తదితర మొత్తం 15 అంశాలపై విస్తృతంగా సమీక్షించి సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో ఎంపీడీవోతో పాటు తహసీల్దార్ సన్యాసిరావు, డిప్యూటీ ఎంపీడీవోలు రమేష్, ముత్తయ్య, ఏఈ–ఆర్‌డబ్ల్యూఎస్ అనూష, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.