🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

ప్రజల ముఖాల్లో చిరునవ్వులే ప్రభుత్వ లక్ష్యం
ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఏమ్మెల్యే బడేటి చంటి ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని, సంబంధిత అంశాలపై అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఇంటి స్థలాలు, సామాజిక పెన్షన్లు, మౌలిక వసతులు తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిపై త్వరితగతిన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
“ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజాదర్బార్ లక్ష్యం. కూటమి ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు చేరువవుతోంది. ప్రతి అర్జీని నమోదు చేసి పరిష్కారం వరకు పర్యవేక్షిస్తున్నాం. ప్రజల సమస్యలు తీరి వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటమే మా పాలనకు నిజమైన సంతృప్తి” అని పేర్కొన్నారు.

