🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
విష సంస్కృతికి వైసీపీ ప్రతీక
శవ రాజకీయాలు మానుకోవాలి
సాయికృష్ణ కేసులో దుష్ప్రచారాలకు పాల్పడొద్దు
రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతిగా మారిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
సాయికృష్ణ మిస్సింగ్ కేసు అంశాన్ని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని, కులాల పేర్లు ప్రస్తావిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి రాజకీయాల వల్లే ప్రజలు వైసీపీని తిరస్కరించారని, మళ్లీ అదే ధోరణి కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఆర్టీసీ జోన్-2 చైర్మన్ అప్పలనాయుడు మాట్లాడుతూ :
సాయికృష్ణ కేసుపై మొదట స్పందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబేనని, బాధిత కుటుంబానికి భరోసా కల్పించడంతో పాటు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారని చెప్పారు. సంబంధిత సీఐపై చర్యలు తీసుకున్నప్పటికీ వైసీపీ నేతలు దుష్ప్రచారాలు ఆపడం లేదని విమర్శించారు. కేసు విషయంలో రాజకీయాలు మానుకుని నిజాలు వెలుగులోకి రావడానికి సహకరించాలని ఆయన సూచించారు.

