🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
స్వర్ణమయ అలంకరణకు రూ.1.5 లక్షల విలువైన బంగారం విరాళం
భీమవరం మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ అలంకరణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన రంగిశెట్టి జగదీష్‌బాబు–సుభాషిణి దంపతులు సుమారు రూ.1.50 లక్షల విలువైన 10 గ్రాముల బంగారాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతెన రమణ, యండా సత్యవతి కలిసి దాతలను శేషవస్త్రాలతో సత్కరించి జ్ఞాపికలు, ప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి స్వర్ణమయ అలంకరణకు భక్తులు ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

