🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు ఈరోజు పట్టణంలోని 5, 6, 7, 9 సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి, పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
సచివాలయాల్లో సిబ్బంది హాజరు రిజిస్టర్, మూవ్మెంట్ రిజిస్టర్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. ప్రతి సిబ్బంది విధులకు సకాలంలో హాజరవుతున్నారా, ఫీల్డ్ విజిట్ రికార్డులు సరిగా మెయింటైన్ చేస్తున్నారా అని క్రాస్ చెక్ చేశారు.
అలాగే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రిపోర్ట్స్ – UFS డేటా ఎంట్రీ, ఫీల్డ్ వెరిఫికేషన్ పనులను కూడా ఇన్స్పెక్ట్ చేశారు. సర్వేలో సేకరించిన కుటుంబ వివరాలు, లబ్ధిదారుల డేటా 100% కరెక్ట్‌గా ఉండేలా చూడాలని, తప్పులు లేకుండా అప్డేట్ చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.
“ప్రజలకు సేవలందించే మొదటి మెట్టు సచివాలయాలు. హాజరు, రికార్డుల నిర్వహణ, డేటా నాణ్యతలో ఎలాంటి రాజీ లేదు. ప్రజా సేవలో నిర్లక్ష్యం సహించబోము” అని కమిషనర్ M. యేసుబాబు సిబ్బందికి స్పష్టం చేశారు.
సచివాలయాల్లో పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యాలు, వచ్చే ప్రజలకు కూర్చునే ఏర్పాట్లు కూడా పరిశీలించారు. ప్రజలకు మర్యాదగా, సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు.

