ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నర్సింహారావు తెలిపారు. కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను కన్వీనర్ దృష్టికి తీసుకువచ్చారు. చావలిపాడు గ్రామానికి చెందిన గూడపాటి లక్ష్మణరావు గ్రామంలోని సీసీ రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వీరమల్లు నర్సింహారావు హామీ ఇచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం, పార్టీ నాయకత్వం కట్టుబడి ఉందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ లంక రత్నారావు, ఏలూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పళ్లెం ఏడుకొండలు, కైకలూరు AMC చైర్మన్ త్రినాథ రాజు, కైకలూరు తెదేపా మండల అధ్యక్షుడు రాధాకృష్ణ, బురుబోయిన శ్రీనివాసరావు, బొమ్మన బోయిన విజయలక్ష్మి, ఆలయం చైర్మన్ గుడివాడ గణేష్, కానుకలు పీఏసీఎస్ అధ్యక్షుడు కోసూరి మాణిక్యాలరావు, మాజీ ఎంపీటీసీ వంగలపాటి ఉషారాణి, బూత్ ఇన్చార్జ్ గడిదేసి విజయ్‌కుమార్, లింగాల బూత్ ఇన్చార్జ్ నాగేశ్వరరావు, వంగలపాటి ఆనంద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

