The Desk … Annavaram : రూ.51 లక్షల విలువైన 102 కేజీల గంజాయి స్వాధీనం

The Desk … Annavaram : రూ.51 లక్షల విలువైన 102 కేజీల గంజాయి స్వాధీనం

🔴 కాకినాడ జిల్లా : అన్నవరం : ది డెస్క్

ముగ్గురు నిందితుల అరెస్ట్

కారు, మొబైల్ ఫోన్లు సీజ్

కాకినాడ జిల్లా ఎస్పీ బింధు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు..

పెద్దాపురం డీఎస్పీ ఏ.బి.జి. తిలక్ పర్యవేక్షణలో…

ప్రత్తిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో..

అన్నవరం పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం శంఖవరం మండలం శృంగధార గ్రామ శివారులో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.51 లక్షల విలువైన 102 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం :

తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి, అటవీ ప్రాంతాల గుండా తరలించి నిల్వ ఉంచారు. అనంతరం అద్దెకు తీసుకున్న కారులో పల్నాడు జిల్లా మాచర్లకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.


స్వాధీనం చేసుకున్న వస్తువులు:

▪️102 కిలోల గంజాయి (విలువ సుమారు రూ.51 లక్షలు)

▪️మారుతీ స్విఫ్ట్ కారు (AP39 RW 4232)

▪️నాలుగు మొబైల్ ఫోన్లు

అరెస్టైన నిందితులు :

తెడ్ల ప్రసాద్ (ASR జిల్లా)

బొల్లేపల్లి నరసింహరాజు అలియాస్ రాజు (పల్నాడు జిల్లా)

తెడ్ల చందుబాబు (ASR జిల్లా, ప్రస్తుతం విశాఖపట్నం)

ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ప్రత్తిపాడు సీఐ బి. సూర్య అప్పారావు, అన్నవరం ఎస్‌ఐ జి. శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్‌ఐ ఎల్. ప్రసాద్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.