The Desk… Eluru II Town Crime : పోలీసుల విధులకు ఆటంకం..ఇద్దరిపై కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు

The Desk… Eluru II Town Crime : పోలీసుల విధులకు ఆటంకం..ఇద్దరిపై కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు టూ టౌన్ : ది డెస్క్ :

పోలీసులపైనే దురుసు ప్రవర్తన

దూల తీరింది ఇద్దరికీ..!!

ఏలూరు నగరంలోని కోర్టు సెంటర్ జంక్షన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి, ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు :

టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. తాడేపల్లి అనిల్ కుమార్, దేవదాసు సుధీర్ కుమార్‌లపై Cr.No.119/2026 కింద BNS సెక్షన్లు 221, 132 r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సందర్భంగా ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ :

విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినా లేదా విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు.

Two arrested for obstructing police at Eluru court junction

Two men were booked and remanded after allegedly obstructing police duty and behaving abusively toward officers at the Court Centre junction on Tuesday. Under DSP D. Shravan Kumar’s orders, Two Town Inspector Ashok Kumar led the operation that produced Tadepalli’s Anil Kumar and Devadasu Sudheer Kumar. Police registered Cr.No.119/2026 under BNS Sections 221 and 132 read with Section 3(5), the statement said.

Inspector Ashok Kumar warned that strict action will follow against anyone who obstructs official duties or mistreats government employees and police personnel.