🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి ➖ స్పెషల్ గ్రేడ్ కమిషనర్
చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు విద్యార్థులకు సూచించారు. స్థానిక ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు ఈ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

