🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని ఎంపీ పుట్టా మహేష్కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం కింద మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ, వంగాయగూడెం సుబ్రహ్మణ్యం కాలనీ, బోరాయిగూడెం, శనివారపుపేట ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీల్లో మొత్తం రూ.4.23 కోట్లతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ :
రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక గ్రాంట్ల నుంచి రాజా కాలనీ, మరడాని రంగారావు కాలనీల్లో రహదారుల నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. విలీన గ్రామాలకు 2027 డిసెంబరు నాటికి గోదావరి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, గరికముకు వీరాంజనేయులు, అంబటి రజిని, నిడిగట్టి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

