The Desk…Eluru : అన్న మాట నిలబెట్టుకున్న నారా లోకేష్… ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశంసలు

The Desk…Eluru : అన్న మాట నిలబెట్టుకున్న నారా లోకేష్… ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశంసలు

  • నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులు
  • ఒక్కరిని కూడా వదలకుండా తీసుకువస్తామని హామీ ఇచ్చిన లోకేష్
  • బుధవారం ఉదయం నుంచీ నిరంతర పర్యవేక్షణ
  • నారా లోకేష్ కృషితో సురక్షితంగా బయటపడ్డ తెలుగు పర్యాటకులు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

నేపాల్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని రక్షించి స్వస్థలాలకు చేర్చేందుకు రెండు రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన కృషిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. నేపాల్ లో జరుగుతున్న మారణహోమంలో దాదాపు 215 మంది తెలుగువారు చిక్కుకుపోయారని తెలియగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన మంత్రి నారా లోకేష్ అనంతపురంలో సూపర్ సిక్స్ సభ పర్యటనను కూడా రద్దు చేసుకుని బుధవారం ఉదయం నుంచి సచివాలయంలోనే ఉండి అక్కడి నుంచే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని నేపాల్ లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకువచ్చే బాధ్యతను చేపట్టిన తీరు నిజంగా స్పూర్తిదాయకమన్నారు. 

స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన వారు కొందరు, దైవదర్శనాలకు వెళ్ళిన వారు కొందరు, ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడ ఆకస్మికంగా మొదలైన హింసాత్మక అల్లర్ల కారణంగా హోటళ్లలో, బస్టాండ్లలో, ఆలయ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఆందోళనకు గురవుతున్న తెలుగువారితో ఫోన్ లో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పడం, నేపాల్ కు ప్రత్యేక విమానం పంపడం, ఢిల్లీలోని ఏపీ భవన్లో అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం నిజంగా ఎంతో అభినందనీయమన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకురావడంలో ప్రత్యేక కృషి చేసిన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు కూడా ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ అభినందనలు తెలిపారు.‎‎

తెలుగువారు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని గతంలో కూడా అనేకసార్లు రుజువైందన్నారు ఏలూరు ఎంపీ. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి తీసుకురావడం, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందుల్లో పడ్డ తెలుగువారిని అక్కడి భారత రాయబార కార్యాలయం, అక్కడి తెలుగు సంఘాల వారితో మాట్లాడి తీసుకురావడం వంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇటువంటి విపత్కర సందర్భాల్లో చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ చూపిస్తున్న చొరవ, మానవత్వం, పాలనా దక్షత గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందన్నారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్. చివరికి నారా లోకేష్ చెప్పినట్టుగానే, నేపాల్ లో చిక్కుకున్న ఆఖరి తెలుగు పర్యాటకుడిని కూడా అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చే కార్యక్రమం దాదాపు పూర్తి కావొచ్చిందని, ఇందుకు నారా లోకేష్ కి తెలుగు ప్రజానీకం అందరి తరపునా నా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్.  తమవారు ఇంకా ఎవరైనా నేపాల్ లో ఉండిపోతే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్స్ ఉపయోగించుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ‎‎

కాట్మండు భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్:‎ 977-980 860 2881, 977-981 032 6134‎

ఆంధ్రప్రదేశ్ వారి కోసం ఢిల్లీ ఏపీ భవన్ నంబర్లు: 98183 95787, 85000 27678‎

ఏపీఎన్‌ఆర్‌ఎస్ హెల్ప్‌లైన్: 0863 2340678‎

ఈమెయిల్ ఐడీలు: helpline@apnrts.com, info@apnrts.com‎