The Desk…పదోన్నతి▪️కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం..@DDO అంచలంచెలుగా..!!

The Desk…పదోన్నతి▪️కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం..@DDO అంచలంచెలుగా..!!

▪️ ఆయనే తూతిక శ్రీనివాస విశ్వనాథ్..

🔴 అల్లూరి జిల్లా : ది డెస్క్ :

2007 APSC గ్రూప్-1 ద్వారా ఎంపికై పంచాయతీరాజ్ శాఖలో 18 సంవత్సరాలు వివిధ హోదాలలో ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు వివిధ మండలాలలో..MPDO గా, పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిగాను, ప్రకాశం మరియు బాపట్ల జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా.. ఏలూరు జిల్లా జిల్లా పంచాయతీ అధికారిగా.. ఈరోజు DDOగా పదోన్నతి అదిరోహించిన సందర్భంగా..

ఎన్నో ఒడిదుడుకులు – ఇబ్బందులు :

విధి నిర్వహణలో ఆయనపై ఎన్నో పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ఆరోపణలు ఎదురైనప్పటికీ ఎంతమంది ఇబ్బంది పెట్టినా.. ప్రతి ఆరోపణను స్వాగతించి స్వయంగా ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించమని కోరి…ఉన్నతాధికారుల విచారణలో తనపై రాబడిన అభియోగాలు రుజువు కాకపోవడంతో కడిగిన ముత్యములా బయటపడిన వైనం.

క్షమాగుణం : తనపై అభియోగాలు చేసిన వారికి తెలుసు – ఆయన ఏ తప్పూ చేయలేదని, చేయడని కూడా.. ఇలాంటివి ప్రభుత్వంలో ఉన్న వారందరికీ సహజమే అని పాజిటివ్ గా తీసుకుని, తనను తాను నిరూపించుకోవడం ఆయన నైజం.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నెన్నో పురస్కారాలు :

ఆయన పనిచేసిన మండలాలు, జిల్లాలు… రాష్ట్రంలోనూ, దేశంలోనూ అగ్రగామిగా నిలిపి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి. అనేక సంస్కరణలకు కేంద్రబిందువుగా, ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తూ.. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం నుండి, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందటమే కాకుండా పబ్లిక్ సర్వెంట్ గా ప్రజల విశ్వాసం పొందారు.

కలెక్టర్ దినేష్ కుమార్ నుండి పురస్కారాన్ని అందుకుంటున్న తూతిక శ్రీనివాస విశ్వనాథ్ (ఫైల్ ఫోటో)

సైన్యంలోనూ : సైన్యంలో 15 సంవత్సరాల దేశానికి సేవలు అందించి ఎగ్జంప్లరి క్యారెక్టర్ తో రిటైర్ అయ్యారు. అదే స్ఫూర్తితో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా ఆ పద్ధతిని కొనసాగిస్తూ అనేకుల మన్ననలను పొందారు. అలాగే మాజీ సైనికుల సంక్షేమం కోసం కూడా కృషి చేశారు.

ప్రస్తుతం : పదోన్నతిపై డ్వామా ఏపీడీగా శ్రీనివాస విశ్వనాధ్

రంపచోడవరం : పదోన్నతిపై మారేడుమిల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను అల్లూరు సీతారామరాజు జిల్లా, రంపచోడవరం డివిజన్ డ్వామా ఏపీడీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రంపచోడవరం ఎంపీడీఓగా కూడా శ్రీనివాస విశ్వనాధ్ సేవలు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాకు డీపీఓగా సేవలు అందించి మారేడుమిల్లికి బదిలీపై వచ్చారు.

గత ఏడాది కాలంలో/జిల్లాల ప్రథమ స్థానం :

శ్రీనివాస విశ్వనాధ్ గత సంవత్సర కాలంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష సేవలు అందించి అందరు మన్ననలు పొందారు. ఎంపీడీఓగా విధులు జాయిన్ అయినా కాలం నుండి వరుసగా 12 నెలలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణిలో మారేడుమిల్లి మండలాన్ని జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిపి రికార్డు సృష్టించారు.

మండలాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానం/దక్షిణ భారతదేశంలో 8వ స్థానం : దేశంలో ఆస్పిరేషన్ బ్లాకుకు ఎంపిక కాబడిన మారేడుమిల్లి మండలాన్ని విద్యా, వైద్యం, పౌష్టికాహారం, సుస్థిర ఆర్ధిక ప్రగతి తదితర అంశాలలో రాష్ట్రంలో ప్రధమస్థానంలో, దక్షిణ భారతదేశంలో ఎనిమిదో స్థానంలో నిలిపి ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కారణమైనందుకు నీతి అయోగ్ జాతీయ పురాష్కారాన్ని అందుకున్నారు.

ఎంపీడీఓగా శ్రీనివాస విశ్వనాధ్ సేవా కాలంలో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ బలోపేతం, పీసా చట్టం అమలు, ఆది కర్మయోగి ఆదివాసీ గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారీ, జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించడం, యోగాంధ్రా తదితర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు విశేష కృషి చేసి ఉన్నత అధికారుల నుంచి పురష్కారం అందుకున్నారు.

ప్రజా ప్రతినిధుల మన్ననలు :

మారేడుమిల్లి మండలంలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా గిరిజనులు ఆర్ధిక అభివృద్ధి సాధించవచ్చని ‘హోమ్ స్టే ప్రణాళికలు’ తయారీకి కృషి చేసిన శ్రీనివాస విశ్వనాధ్ ప్రజా అధికారిగా ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందారు.

ముఖ్యమంత్రి మెప్పు పొందిన : రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది నిరుపేదలకు ఇస్తున్న సామాజిక భద్రతా పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’ పేరును సూచించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్న శ్రీనివాస విశ్వనాధ్ మాజీ సైనికుడు కూడా.

పిఠాపురం నియోజకవర్గ ప్రజల ప్రశంసలు : శ్రీనివాస విశ్వనాధ్ గతంలో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో సేవలు అందించి వరదల సమయంలో రైతులకు దానా సహకారం, గ్రామాలలో మద్యపానం నిషేధం కోసం మహిళలకు ఉద్యమ సహకారం, ఉపాధి కల్పనలో యువతకు, ఎస్సీ ప్రాంతాలలో త్రాగునీరు, వర్షా కాలంలో వృత్తి కోల్పోతున్న నేతన్నలకు ప్రభుత్వ అండగా ఉండాలని, వాడబలిజలకు సముద్ర వర్తక వ్యాపారాలలో రాయల్టీ ఇవ్వాలని, వెనుబడిన కులాల సంక్షేమం, పేదలకు కోసం ఇలా అన్నీ వర్గాల ప్రజలకు చేరువుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో విశేష సేవలు అందించి పిఠాపురం నియోజకవర్గం ప్రజల ప్రశంసలు పొందారు.

ప్రభుత్వం ప్రశంశించిన ప్రజాధికారి : అనంతరం పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల డీపీఓగా, ప్రకాశం, బాపట్ల జిల్లాల ఈడీ ఎస్సీ కార్పొరేషన్ గా అత్యుత్తమ సేవలు అందించి ప్రభుత్వo నుంచి ప్రశంసలు అందుకున్నారు.

మున్ముందు : భవిష్యత్తులో కూడా ప్రజాసంక్షేమం కోసం రాజీపడకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలు, ప్రభుత్వం మన్ననలు పొందడానికి కృషి చేయాలని అందరం ఆశిద్దాం..!!

✍️✍️ అత్యం. విశ్వనాధ్ (ది డెస్క్ – జాతీయ పత్రిక, ఎడిటర్ & పబ్లిషర్)