🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :
కార్యకర్తలకు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ శ్రేణులు సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. మంగళవారం పవర్పేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభేదాలకు తావివ్వకుండా కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు.
బాధితులకు న్యాయ సాయం అందిస్తాం
సమస్యలతో న్యాయ సలహా కేంద్రాన్ని ఆశ్రయించే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా ఇచ్చారు. మంగళవారం పవర్పేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన న్యాయ సలహా కేంద్రంలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను న్యాయవాదులకు వివరించారు. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం అందించాలని ఆయన సూచించారు.

