🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

కోతులను పట్టించి అటవీ ప్రాంతానికి తరలింపు
కోతుల సమస్య పరిష్కారానికి పంచాయతీ చర్యలు
గ్రామస్థుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు
పలువురు స్థానికుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్న పంచాయతీ అధికారులు
ఉంగుటూరు గ్రామపంచాయతీ పరిధిలో కోతుల బెడదను నివారించేందుకు ఉంగుటూరు గ్రామపంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.
స్థానికులను, విద్యార్థులను, వృద్ధులను, బాటసారులు… కోతులవల్ల పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల.. స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేయటం వల్ల పంచాయతీ అధికారులు మంకీ ఆపరేషన్ చేయడం జరిగింది
ఉంగుటూరు గ్రామపంచాయతీ పరిధిలో కోతులను పట్టించి, జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కోతుల సంచారంతో గ్రామస్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు అధికారులు తీసుకున్నారు.
కోతుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాటికి ఎలాంటి హాని జరగకుండా తరలింపు ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఉంది. పట్టుకున్న కోతులను తగిన అనుమతులు, అటవీశాఖ మార్గదర్శకాల మేరకు సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పంచాయతీ అధికారులు తీసుకున్న ఈ చర్యల వల్ల గ్రామంలో కోతుల బెడద తగ్గిందని స్థానికులు హర్షించారు.

OG మీరు బిజీ
ఏనుగులనే కాదు కోతులనూ పట్టించుకోండి
ప్రత్యామ్నాయం ఆలోచించండి పవన్ సారు
అడవుల్లో ఆకలి.. జనావాసాల్లో కోతుల కలకలం..!!
అడవుల్లో పండ్ల చెట్లు పెంచండి.. కోతుల బెడద తగ్గించండి!
కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉంగుటూరు మండలాన్ని ఆనుకుని ఉన్న ఏ, బీ బ్లాకుల అటవీ ప్రాంతాల్లో, గ్రామాల సరిహద్దుల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటాలని సూచిస్తున్నారు.
ఏడాది పొడవునా పండ్లు అందించే చెట్లతో పాటు నీటి సదుపాయం కల్పిస్తే కోతులు ఆహారం, నీటి కోసం గ్రామాల్లోకి రావడం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రజలపై దాడులు, దుకాణాల నుంచి పండ్లు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక అటవీ సంరక్షణ చర్యలు అవసరమని పేర్కొంటున్నారు.

