🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
గ్రామీణ రహదారులకు రూ.20 కోట్ల నిధులు
ఏడు నియోజకవర్గాల్లో సీసీ రోడ్లకు గ్రీన్‌సిగ్నల్
మంజూరైన రోడ్ల పనులు వెంటనే ప్రారంభించాలి
➖ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వీబీ-జీ రామ్ జీ పథకం కింద రూ.19.8 కోట్ల విలువైన సీసీ రోడ్ల పనులకు అనుమతులు మంజూరైనట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. మంజూరైన పనులకు వెంటనే శంకుస్థాపనలు చేసి ప్రారంభించాలని 27 మండలాల టీడీపీ నాయకులు, ఇన్‌ఛార్జిలకు సూచించారు. పంచాయతీ తీర్మానాలు అందని గ్రామాలకు రెండో విడతలో నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

