🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం (PGRS)లో స్పెషల్ గ్రేడ్ కమిషనర్ ఎం. యేసుబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఆస్తిపన్ను, పారిశుద్ధ్య సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, కొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశించారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

