🔴 పగో : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మ ఆలయంలో..అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు
88 మంది దంపతుల భాగస్వామ్యం
భీమవరం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మావుళ్లమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా శనివారం చండీహోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాన్ని జరిపించారు.
ఈ కార్యక్రమంలో 88 మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు హోమంలో పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పలువురు భక్తులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ వెల్లడించారు.

