The Desk … Eluru : ముస్లిం మైనార్టీలకు రెండు నామినేటెడ్‌ పదవులు ➖ఎమ్మెల్యే చంటి ప్రకటన

The Desk … Eluru : ముస్లిం మైనార్టీలకు రెండు నామినేటెడ్‌ పదవులు ➖ఎమ్మెల్యే చంటి ప్రకటన

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలకు త్వరలో రెండు నామినేటెడ్‌ పదవులు కేటాయిస్తామని ప్రకటించారు.
ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముస్లిం మైనార్టీ కుటుంబాలు, రజక సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారికి బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు మీరావలీ, జిల్లా మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.