🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
జిల్లా స్థాయిలో సత్కారం.. పారిశుద్ధ్య కార్యక్రమాలకు గుర్తింపు
స్వచ్ఛత, పారిశుద్ధ్యం, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో విశేష కృషికి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి జిల్లా స్థాయిలో మూడు స్వచ్ఛతా హి సేవా అవార్డులు లభించాయి. మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు మార్గదర్శకత్వంలో, అసిస్టెంట్ కమిషనర్ డి. భవానీబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ గుర్తింపు దక్కింది.
అవార్డులు రావడంపై కమిషనర్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. ఇది సమిష్టి కృషి, అంకితభావానికి నిదర్శనమని పేర్కొంటూ.. “స్వచ్ఛమైన తాడేపల్లిగూడెం–ఆరోగ్యకరమైన తాడేపల్లిగూడెం” లక్ష్యంతో మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.

