🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : పూళ్ళ : ది డెస్క్ :
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పూళ్ళ గ్రామ పంచాయతీలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు, ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా.. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై గ్రామసభల్లో చర్చించారు
ఈ కార్యక్రమంలో పూళ్ల పంచాయతీ కార్యదర్శి సునంద, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడి వర్కర్స్, హెల్త్, డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

