🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మండలం : మెట్ట ఉప్పరగూడెం : ది డెస్క్
మెట్ట ఉప్పరగూడెంలో గాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మెట్ట ఉప్పరగూడెo గ్రామ పంచాయతీలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు, ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా.. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై గ్రామసభల్లో చర్చించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, వార్డు సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

