🟡 ఏలూరు జిల్లా : తెదేపా జిల్లా కార్యాలయం : ది డెస్క్ :
అరాచక విధానాలకు అడ్డుకట్ట వేస్తున్నాం
➖ ఎమ్మెల్యే చంటి
అహింసా మార్గంలో స్వరాజ్య సాధనకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఏలూరు అమీనా పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతో కలిసి గాంధీ చిత్రపటానికి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
అరాచక విధానాలకు అడ్డుకట్ట వేస్తూ శాంతియుత పాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గాంధేయ సిద్ధాంతాలను పాలనలో ఆచరణలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

