🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
పేదల సంక్షేమమే తొలి ప్రాధాన్యత
అర్హులందరికీ పథకాలు చేరేలా చర్యలు
ప్రజల వద్దకే సంక్షేమం
పెన్షన్దారులకు అండగా ప్రభుత్వం
పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం
సంక్షేమం.. అభివృద్ధి రెండూ సమాంతరం
బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం
కార్యకర్తలే పార్టీకి బలం
ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు
➖ఎమ్మెల్యే సౌమ్య
పేదలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. గురువారం నందిగామ కాకాని నగర్లో సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
సీఎం చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో
పనిచేస్తున్నారని తెలిపారు.
కూటమి విజయమే లక్ష్యం – మండలాల వారీగా పార్టీని బలోపేతం చేయాలి :
అనంతరం కాకాని నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు మక్కెన మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ రూపొందించాలని సౌమ్య సూచించారు. ప్రతి గ్రామం, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

