The Desk … Nandigama : దగ్గుల కేశవరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు ➖ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సౌమ్య

The Desk … Nandigama : దగ్గుల కేశవరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు ➖ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సౌమ్య

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : వీరులపాడు : ది డెస్క్ :

నిబద్ధత కలిగిన నేతను కోల్పోయాం

కేశవరెడ్డి సేవలు చిరస్మరణీయం

టీడీపీ సీనియర్‌ నేత కేశవరెడ్డి కన్నుమూత

కార్యకర్తలకు అండగా నిలిచిన నేత కేశవరెడ్డి

అల్లూరు గ్రామ మాజీ సర్పంచ్‌, మాజీ డీసీ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, సీనియర్‌ నేత దగ్గుల కేశవరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. కేశవరెడ్డి మృతికి ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య సంతాపం తెలియజేస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు :

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచిన ఆయన సేవలను పార్టీ శ్రేణులు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీనియర్‌ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. కేశవరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తంగిరాల సౌమ్య, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.