🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్ వర్గాల్లోని అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 63 లక్షల మంది పింఛనుదారులకు నెలకు రూ.2,693 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఏలూరు జిల్లాలో 2.53 లక్షల మందికి రూ.111.60 కోట్ల పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో పింఛన్ల కోసం రూ.73,507 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అర్హులైన వారు సెప్టెంబరు 16లోపు ధ్రువీకరణ పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల నుంచే కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎంపీ పేర్కొన్నారు.

