🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : ది డెస్క్ :
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన
నందిగామ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివాహ వేడుకలు, నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమాలకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి, నూతన వధూవరులు, చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

నందిగామలో – నూతన వధూవరులకు ఆశీస్సులు :
నందిగామ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో బత్తిన రాంబాబు కుమార్తె వివాహ వేడుకకు కూటమి నేతలతో కలిసి సౌమ్య హాజరయ్యారు. నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

కంచికచర్లలో వివాహానికి హాజరై :
కంచికచర్ల పట్టణంలోని ఓసీ క్లబ్లో వెల్లంకి రామారావు కుమారుడు, బంక ముక్కంటి కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
వీరులపాడులో – వివాహానికి హాజరై :
నరసింహారావుపాలెంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు ఐలూరి శ్రీనివాస్‌రెడ్డి (లేటు) కుమారుడి వివాహ వేడుకకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం హాజరయ్యారు. కూటమి నేతలతో కలిసి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ముత్యాలమ్మ దేవస్థానానికి భూమిపూజ :
నందిగామ మండలం ఐతవరం గ్రామంలో నూతన ముత్యాలమ్మ పోతురాజు దేవస్థానం నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం నిర్మాణం త్వరితగతిన పూర్తై గ్రామ ప్రజలకు ఆధ్యాత్మికంగా మరింత ఉపయోగకరంగా నిలవాలని ఆకాంక్షించారు.

కంచికచర్లలో – నూతన వస్త్ర బహుకరణ – చిన్నారి వైష్ణవికి :
కంచికచర్ల పట్టణంలో గుత్తా వెంకటరత్నం మనవరాలు వైష్వి నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం సందర్భంగా ఆమె స్వగృహానికి వెళ్లిన సౌమ్య.. కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి వైష్వికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు.

మున్నలూరులో – చిన్నారి శరణ్య నూతన వస్త్ర బహుకరణ :
మున్నలూరు గ్రామంలో సూర్యదేవర భాస్కరరావు మనవరాలు శరణ్య నూతన వస్త్ర బహూకరణ వేడుకలోనూ సౌమ్య పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నేతలు, స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

