🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ మండలం : ఐతవరం :

ముత్యాలమ్మ పోతురాజు దేవస్థానానికి భూమి పూజ
ఐతవరం – ఆధ్యాత్మిక అభివృద్ధికి మరో ముందడుగు
ఐతవరం గ్రామంలో నూతన ముత్యాలమ్మ పోతురాజు దేవస్థానం నిర్మాణానికి ఆదివారం భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవస్థానం నిర్మాణం త్వరితగతిన పూర్తికావాలని, గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత మరింత పెంపొందాలని నాయకులు ఆకాంక్షించారు.

