The Desk … Eluru : త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలి➖ ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలి➖ ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఏలూరు జిల్లా సర్వజనాసుపత్రిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

అనంతరం విశిష్ట సేవలందించిన వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి, ప్రముఖ వ్యాపారవేత్త కెకె గుప్తాను వైద్యులు సత్కరించారు.