The Desk … Bhimavaram : 1,108 మంది మహిళల గీతా పారాయణం

The Desk … Bhimavaram : 1,108 మంది మహిళల గీతా పారాయణం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

గీత పఠనంతో.. ప్రశాంతత, సత్ప్రవర్తన, ధైర్యం, ఏకాగ్రత
➖ ఈఓ నగేష్

భగవద్గీత పఠనంతో ఆత్మజ్ఞానం, సత్ప్రవర్తన అలవడటంతో పాటు మానసిక ప్రశాంతత, ధైర్యం, ఏకాగ్రత పెరుగుతాయని మావుళ్లమ్మ దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహంతో నిర్వహిస్తున్న కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో భాగంగా శనివారం మావుళ్లమ్మ ఆలయంలో 1,108 మంది మహిళలతో సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ట్రస్ట్ సభ్యుడు వీవీఎస్ శర్మ మాట్లాడుతూ గీతా పారాయణం మనిషికి కర్తవ్యనిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. మహిళలు ముక్తకంఠంతో గీతా పారాయణం చేయడం శుభపరిణామమన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఆలయ ధర్మకర్తలు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు మద్దిరాల మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.