The Desk … Eluru : ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ➖ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ➖ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు తెదేపా జిల్లా కార్యాలయం : ది డెస్క్ :

దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు భారతీయులు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ సమాజ రక్షణకు కృషి చేయాలని బడేటి చంటి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.