The Desk… Tadepalligudem : SIR కార్యక్రమంపై రాజకీయ పార్టీల BLAలకు అవగాహన

The Desk… Tadepalligudem : SIR కార్యక్రమంపై రాజకీయ పార్టీల BLAలకు అవగాహన

🔴 పగో :తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

పారదర్శక ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలని కమిషనర్, ఆర్డీఓ పిలుపు

తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో అవగాహన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఆర్డీఓ సంయుక్తంగా సమావేశానికి అధ్యక్షత వహించారు.

సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో BLAలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, ఇతర సవరణలు నిబంధనల ప్రకారం చేపట్టేలా సహకరించాలని కోరారు.

సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ :

అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందేలా చర్యలు తీసుకుంటామని, ఇంటింటి సర్వేలో BLOలకు BLAలు పూర్తి సహకారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల BLAలు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు మేనేజర్, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.