The Desk… Eluru : ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

The Desk… Eluru : ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు/చోదిమెళ్ళ : ది డెస్క్ :

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
➖కలెక్టర్ వెట్రిసెల్వి

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు
➖ఎమ్మెల్యే బడేటి చంటి

అన్నదాతల పండుగగా భావించే ఏరువాక పౌర్ణమి వేడుకలను ఏలూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చొదిమెళ్లలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మేయర్ షేక్ నూర్జహాన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్‌కిషోర్ తదితరులు రైతులతో కలిసి పాల్గొన్నారు.

వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులకు పంపిణీ చేశారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో ఎడ్లతో, ఆధునిక విధానంలో ట్రాక్టర్లతో దుక్కి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ :

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచిస్తూ, యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత రెండేళ్లలో రైతుల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేశామని, సంప్రదాయ ఏరువాక పౌర్ణమి వేడుకలను శాస్త్రీయ విధానాలతో నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. రైతులకు మరింత మేలు జరిగేలా భవిష్యత్తులోనూ చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.