🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టినా…అది మళ్లీ భవిష్యత్ తరాలకు దరిచేరకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఆదివారం పవర్‌పేటలోని సదానంద స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించిన ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
పోలియో నిర్మూలనలో భారత్ విజయాన్ని సాధించినప్పటికీ నిర్లక్ష్యానికి తావులేదన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఈ మహాయజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు తల్లిదండ్రులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

