🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

డ్రగ్స్ రహిత జిల్లాగా ఏలూరును తీర్చిదిద్దుదాం
యువత డ్రగ్స్ జోలికి పోవద్దు
సమాజం అప్రమత్తంగా ఉండాలి
నషాముక్త్ భారత్‌లో విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు
మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరి భాగస్వామ్యం అవసరం
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే వాటి వినియోగాన్ని నివారించవచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయుల మధ్య జరిగిన క్రికెట్ పోటీల విజేతలకు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)తో కలిసి కలెక్టర్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ :
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సమాజమంతా బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ :
జిల్లాలో గంజాయి తదితర మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, సమాచారం తెలిసిన వెంటనే 14446 లేదా 1972 టోల్‌ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని సూచించారు.

ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని, “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం తీసుకొస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రికెట్ పోటీల విజేతలు, మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమెంటోలు, బహుమతులు అందజేశారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించి, సంతకాల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

