🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్లమ్మ సేవలో కాకినాడ దంపతులు
శాశ్వత అన్నదానానికి మరో రూ.1,00,116 విరాళం
భీమవరం పట్టణంలో వెలసిన మావుళ్ళమ్మ వారి ఆలయానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు. అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు కోసం కాకినాడకు చెందిన కంటిపూడి విద్యాసాగర్–సావిత్రి దేవి దంపతులు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు.
అదేవిధంగా మావుళ్లమ్మ వారి శాశ్వత అన్నదాన కార్యక్రమం కోసం తమ కుటుంబ సభ్యుడు చి. వివేక్ పేరు మీద రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ దాతలను సత్కరించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
భక్తుల సహకారంతో అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు, శాశ్వత అన్నదాన కార్యక్రమాలు మరింత విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. అమ్మవారిపై భక్తి, సేవాభావంతో భక్తులు ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

