The Desk…TG : హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేత‼️

The Desk…TG : హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేత‼️

🔴 TG/ HYD : THE DESK : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ కూల్చివేతను అధికారులు చేపట్టారు.

తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు..‼️

మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు.

హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) తీసుకొచ్చారు.

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు.

ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు, భయం పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒకచోట ఆక్రమణలను కూల్చి వేస్తున్న అధికారులు..‼️

నాగార్జున ఎన్- కన్వెన్షన్ పై ఈ నెల 21న సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన మంత్రి కోమటిరెడ్డి..

మంత్రి లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్..

తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్‌టీఎల్ లో ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపిన మంత్రి

శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలు

హైడ్రాకు ఇచ్చిన కోమటిరెడ్డి..

మంత్రి లేఖపై విచారణ జరిపి రంగంలోకి దిగిన హైడ్రా

www.thedesknews.net