The Desk…Mantralayam : సమస్య పరిష్కారంలో పరిమళించిన మానవత్వం

The Desk…Mantralayam : సమస్య పరిష్కారంలో పరిమళించిన మానవత్వం

  • హిమాన్షు శుక్లా, సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ

కర్నూలు జిల్లా : మంత్రాలయం : ది డెస్క్ :

కర్నూలు జిల్లా మంత్రాలయం కు చెందిన ఫ్మామిలీ సమస్యతో వచ్చిన వారి సమస్యను తక్షణమే పరిష్కరించిన సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా..

ఆ జిల్లా కలెక్టర్ తో తక్షణమే మాట్టాడి వారి ముందే సమస్యను పరిష్కిరించారు.. అది ఆయన సమస్యపై స్పందించే తీరుకు నిదర్శనం…. సమస్య పట్ల చిత్తశుద్దికి ఈ సంఘటన నిదర్శనం..

నిత్యం వందలాది మంది తమ సమస్యల పరిష్కారానికి నాయకులు, అధికారుల దగ్గరకు వస్తుంటారు. అయితే ఇక్కడ పేద దంపతులు తమ సమస్య పరిష్కారానికి కూడా వచ్చారు. అయితే వారికి లోపలికి ఎలా వెళ్లాలో తెలియదు.. ఎవరిని కలవాలో తెలియదు.. మామూలుగా అయితే అధికారులు తమ పనిఒత్తిడి వల్ల సహజంగా ఎవ్వర్నీ పట్టించుకోరు..

కాని ఆయన వ్యక్తిత్వం వేరు ఆయనే సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా.. అలాంటి సమయంలో అక్కడికి వచ్చిన సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా.. వచ్చిన వారి సమస్యను తమ సమస్యగా భావించి వారు ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకుని సమస్య పరిష్కారంలో తన వంతు చేసి వారి సమస్యను పరిష్కరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించుకున్నందుకు ఆయనకు వారు ధన్యవాదాలు తెలియజేశారు..