The Desk … Eluru : కార్యకర్తలే కూటమికి కొండంత బలం

The Desk … Eluru : కార్యకర్తలే కూటమికి కొండంత బలం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :

ఎన్నిక ఏదైనా.. గెలుపు కూటమిదే

ప్రజా విశ్వాసమే విజయానికి బాట

క్షేత్రస్థాయి బలమే కూటమి బలం

గెలిచినవారు ప్రజల నమ్మకం నిలబెట్టాలి -ప్రజలకు అందుబాటులో ఉండాలి.

➖ఎమ్మెల్యే చంటి

క్షేత్రస్థాయి కార్యకర్తలే కూటమి పార్టీకి అసలైన బలమని, ఎన్నిక ఏదైనా విజయం కూటమిదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. గురువారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గెలిచిన ప్రతినిధులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజా విశ్వాసమే భవిష్యత్తు విజయాలకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.