The Desk … Tadepalligudem : ఎన్నికలకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ సన్నద్ధం

The Desk … Tadepalligudem : ఎన్నికలకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ సన్నద్ధం

🟡 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

సెక్షన్ హెడ్లతో కమిషనర్ సమీక్ష

పకడ్బందీ ఏర్పాట్లకు ఆదేశాలు

కార్మికుల భద్రతకూ పెద్దపీట

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

➖ యేసుబాబు (స్పెషల్ గ్రేడ్ కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం)

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘం సిద్ధమవుతోంది. ఎన్నికల విధులు, ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు బుధవారం కౌన్సిల్ హాల్‌లో సెక్షన్ హెడ్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు తాము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

కుటుంబ భద్రతకు బీమా భరోసా :

సిబ్బందికి బీమా ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. విధి నిర్వహణలో ఉన్న ఓ వర్కర్ మృతితో ఆయన భార్యకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ ద్వారా రూ.24 లక్షల చెక్కు అందిన విషయాన్ని ఉదహరించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ ఆర్థిక భద్రత కోసం బీమా చేయించుకోవాలని సూచించారు.

వర్కర్లకు రెయిన్‌కోట్లు :

తుఫాన్ ప్రభావంతో వర్షంలోనూ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వర్కర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా త్వరలో రెయిన్‌కోట్లు అందించాలని నిర్ణయించారు.

సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ డి. భవానీ బాబు, మున్సిపల్ ఇంజినీర్ వై. వెంకటరమణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.