🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
అధికారులకు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించి, పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన, సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

