🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, తెదేపా జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 34 మందికి రూ.18.68 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మరో ఎనిమిది మందికి రూ.21.81 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు. ఇప్పటివరకు 871 మంది బాధితులకు రూ.7.97 కోట్లకుపైగా సాయం అందించినట్లు తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

