🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
బాల త్రిపురసుందరి అలంకరణలో మావుళ్లమ్మ దర్శనం
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా భీమవరంలోని మావుళ్లమ్మవారు సోమవారం శ్రీ బాల త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు హైదరాబాద్‌కు చెందిన కలిదిండి అజయ్‌బాబు, జమి వర్ధని దంపతులు రూ.2.20 లక్షల విలువైన 16 గ్రాముల బంగారాన్ని సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో దంపతులకు పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొని ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

