The Desk … Eluru : 62 డివిజన్లలో కూటమి గెలుపే లక్ష్యం

The Desk … Eluru : 62 డివిజన్లలో కూటమి గెలుపే లక్ష్యం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ సుముఖం

➖ఎమ్మెల్యే చంటి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరులోని 62 డివిజన్లనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. మేయర్‌ ఎన్నికలోనూ కూటమి విజయానికి కృషి చేస్తామన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంలో వైసీపీ వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమని విమర్శించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ సుముఖంగా ఉందని స్పష్టం చేశారు.