The Desk … Nandigama : నందిగామ మార్కెట్‌యార్డుకు రూ.42 లక్షలు

The Desk … Nandigama : నందిగామ మార్కెట్‌యార్డుకు రూ.42 లక్షలు

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

ఎఫ్‌ఐసీ భవనం మరమ్మతులకు రూ.40 లక్షలు

ఆర్వో ప్లాంట్‌కు రూ.2 లక్షలు

మార్కెట్‌యార్డు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రూ.42 లక్షల నిధులు మంజూరయ్యాయి. మార్కెట్‌యార్డు సేవింగ్స్‌ నిధుల నుంచి ఎఫ్‌ఐసీ భవనం మెయింటెనెన్స్‌, మరమ్మతులకు రూ.40 లక్షలు, ఆర్వో ప్లాంట్‌ ఇన్సులేషన్‌ పనులకు రూ.2 లక్షలు కేటాయించారు. ఇందుకు సంబంధించిన సాంక్షన్‌ పత్రాన్ని మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ అమ్మినేని జ్వాలా ప్రసాద్‌, సెక్రటరీలు శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అందజేశారు. మార్కెట్‌యార్డులో రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి అండ :

32 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల చెక్కుల పంపిణీ

అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో శనివారం నందిగామకు చెందిన 32 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ పరిశీలకులు తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, కూటమి నేతలతో కలిసి ఆమె పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సూర్యనారాయణ కుటుంబానికి ఎమ్మెల్యే సౌమ్య పరామర్శ :

నందిగామ పట్టణంలోని భాను హోమియో క్లినిక్‌ రోడ్డులో దొడ్డపనేని సూర్యనారాయణ పార్థివదేహాన్ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం సందర్శించారు. పూలమాల వేసి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె వెంట కూటమి నాయకులు ఉన్నారు.