🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
వాయు సర్వేక్షణ్‌లో 4వ ర్యాంకు
బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న భాను
ఇది ఏలూరు ప్రజలందరి విజయం
➖భాను ప్రతాప్ (నగర కమిషనర్)
వాయు కాలుష్య నియంత్రణలో ఏలూరు నగరపాలక సంస్థ గణనీయమైన పురోగతి సాధించింది. 3 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో గతంలో 31వ స్థానంలో ఉన్న ఏలూరు ఈసారి నాలుగో ర్యాంకుకు చేరింది.
ఈ ప్రతిభకు గుర్తింపుగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో వాయు సర్వేక్షణ్ కేటగిరీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ అవార్డు అందుకున్నారు.
చెత్త, బయోమాస్ దహనం నివారణ, రోడ్ల దుమ్ము నియంత్రణ, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, వాహన కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత పర్యవేక్షణ, పచ్చదనం పెంపు తదితర అంశాల్లో చేపట్టిన చర్యలకు ఈ గుర్తింపు లభించింది. ఈ విజయం ఏలూరు ప్రజలందరిదని, మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు.

