🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
CMO సర్వేలో 6వ స్థానం
CBN ప్రశంసించడం – సంతోషం
➖ ఎమ్మెల్యే చంటి
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తనకు ఆత్మసంతృప్తినిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వేలో 6వ స్థానం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రశంసలు లభించడం గర్వకారణమన్నారు.
ఈ సందర్భంగా పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కలవకొల్లు సాంబ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, యువకులు, స్థానికులు బడేటి చంటిని ఘనంగా సన్మానించి కేక్ కట్ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం అందుబాటులో ఉండటమే తన విజయానికి కారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి, మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

