The Desk … Kanchikacharla : మున్నలూరుకు బీటీ రోడ్డు

The Desk … Kanchikacharla : మున్నలూరుకు బీటీ రోడ్డు

🟡 ఎన్టీఆర్ జిల్లా : కంచికచర్ల మండలం : ది డెస్క్ :

గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కంచికచర్ల మండలం మున్నలూరులో CAD–R&B రోడ్డు అభివృద్ధి పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు.

1.350 కి.మీ. మేర బీటీ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారి పూర్తయితే మున్నలూరు ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.