🟡 అమరావతి : ది డెస్క్ :
▪️ఏలూరుకు ప్రశంసలు▪️
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు
రాష్ట్రంలో జిల్లాల ప్రగతి, పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏలూరు జిల్లా విశేష ప్రతిభ కనబరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకంది. గతంలో 31వ స్థానంలో ఉన్న ఏలూరు జిల్లా, ఏకంగా 27 స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సమీక్షా సమావేశంలో జిల్లాల ర్యాంకింగ్‌లకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు.
ఏలూరు జిల్లా సాధించిన పురోగతిపై సీఎం స్పందిస్తూ.. “ఏలూరు అన్ని జిల్లాల కంటే మెరుగైన పనితీరు (బెస్ట్ పర్ఫార్మెన్స్) కనబరిచింది.
ఈ విజయంలో పాలుపంచుకున్న జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరికీ అభినందనలు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది” అని కొనియాడారు.

